Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీసీ చైర్మెన్ ఆదిల్ జైనుల్ భాయ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలు ప్రతికూలమైనవేమి కాదనీ, అవి విలువైన విషయాలను నేర్పేవని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మెన్ ఆదిల్ జైనుల్ భాయ్ తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కీ) ఆధ్వర్యంలో సోమవారం సోమాజీగూడ ప్రాంగణంలో పీజీడీఎం బ్యాచ్ -2, పీజీడీహెచ్ఎం-బ్యాంచ్ 15 స్నాతకోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువ గ్రాడ్యుయేట్లు కీలక సమయంలో ఉన్నారంటూ, వారు తమ జీవితాన్ని ఎలా ఫలవంతం చేసుకోవాలి?..దేశానికి అసరమైన మార్పుల కోసం అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. భారతదేశంలో డిజిటల్ మౌలిక వసతుల కల్పన శరవేగంగా పెరుగుతున్నదనీ, ఆధార్, యుపీఐలను ఉదహరించారు. ప్రజలకు ఇంటర్నెట్ ను అందుబాటులోకి తేవడంలో భారతదేశం, యుఎస్ఏ కన్నా వేగంగా అందించిందని తెలిపారు. కార్యక్రమంలో 90 మంది పీజీడీఎం, పీజీడీఎం (హెల్త్‌కేర్ మేనేజ్మెంట్), పోస్టు గ్రాడ్యుయేట్ పట్టాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అస్కి చైర్మెన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పద్మనాభయ్య, ఇన్ ఛార్జి డైరెక్టర్ జనరల్ డాక్టర్ నిర్మల్యా బాగ్చీ తదితరులు పాల్గొన్నారు.