Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య కొత్తగా ప్రవేశ పెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సామాన్య ప్రజలకు అందు బాటులో ఉండేది కాదనీ, కేవలం ధనికులకు ఉపయోగపడేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పార్లమెంట్ సాక్షిగా చేసిన విభజన చట్టంలోని అంశాలు 8ఏళ్లలో ఏ ఒక్కటైనా నెరవే ర్చారా? అని నిలదీశారు. సోమ వారం హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పండగపూట రాజ కీయాలు మాట్లాడకూడద నుకు న్నాననీ, కానీ మాట్లాడక తప్పడం లేదని చెప్పారు. ఇది మొదటి రైలు కాదనీ, ఇప్పటి వరకు 17 రైళ్లు నడుస్తున్నాయనీ, వందే భారత్ 18వ రైలు అని తెలి పారు. దేశ ప్రధాని, ఇద్దరు కేంద్ర మంత్రులు, గవర్నర్ అందరూ ఒక రైలు ప్రారంభానికి విస్తృత ప్రచారం చేయడమేంటని ప్రశ్నిం చారు. ప్రజోపయోగ కార్యక్రమా లపై దృష్టి సారించకుండా కొత్త పేర్లు, కొత్త నినాదాలు, ప్రచారాలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శించారు.