Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసులు రాగానే దొంగలు పరార్
- రోడ్డుపై చిందర వందరగా పడ్డ నోట్లు
నవతెలంగాణ - కోరుట్ల
కోరుట్ల పట్టణంలో దుండ గులు సినీఫక్కీలో ఏటీఎంలో చోరీకి పాల్ప డ్డారు. పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఎస్బీఐ తండ్రియాలా బ్రాంచీలో శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో దుండగు లు చోరీకి యత్నించారు. కారులో వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి ఎస్బీఐ బ్యాంకు వద్ద కారు నిలిపి ఏటీఎంలోకి చొరబడి వెంట తెచ్చుకున్న ఆయుధాలతో మిషన్‌ను పగులగొట్టి అందులోని డబ్బులను దొంగిలించారు. ఏటీఎం నుంచి డబ్బులు తీస్తుండగా అందులో ఉన్న అల్లారం మోగింది. దీంతో పెట్రోలింగ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్పటికే డబ్బును బ్యాగ్‌లో పెట్టుకున్న దొంగలు కారులో ఎక్కుతుండగా పెట్రోలింగ్ వాహనం అక్కడికి చేరుకుంది. పోలీసు వాహనంతో చేజ్ చేయగా, దొంగలు ప్రయాణిస్తున్న కారు నుండి కరెన్సీ కట్టలు రోడ్డుపై చిందర వందరగా పడిపోయాయి. 19లక్షల 200 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసు కున్నట్టు సమాచారం. పారిపోయిన దొంగలను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న డబ్బును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.