Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీటీడీపీ అధ్యక్షులు కాసాని
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వికారాబాద్ జిల్లా కోట్పల్లి ప్రాజెక్టులో ఈతకు వెళ్లి నలుగురు యువకులు మృతి చెందడం చాలా బాధాకరమని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి సంబరాల్లో కనుము పండుగ రోజు ఈ విషాద ఘటన జరగటం దురదృష్టకరమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఎక్స్గ్గ్గ్రేషియా చెల్లించడమే కాకుండా వారిని అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.