Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండింగ్ బిల్లులు మంజూరు చేయించాలి : సీఎస్‌కు టీఎస్ యుటీఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తొలి మహిళా అధికారి శాంతికుమారిని టీఎస్ యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి, కోశాధికారి టి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఏర్పుల గాలయ్య, ఎమ్మెల్సీ అభ్యర్థి పి మాణిక్ రెడ్డి సోమవారం సీఎస్‌ను మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవా లని కోరారు. బకాయి పడ్డ మూడు వాయిదాల కరువు భత్యం ప్రకటించాలనీ, పెండింగ్ బిల్లుల నిధులు ఉపాధ్యాయుల ఖాతాల్లో జమచేయాలనీ, కెేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బేసిక్ పే ఇవ్వాలనీ, బ్లాక్ చేసిన 13 జిల్లాల భార్యాభర్తల బదిలీలకు అనుమతి ఇవ్వాలని కోరారు. బీసీ గురుకుల పాఠశాల ల పనివేళలు మార్చాలనీ, ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించాలనీ, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్, ఎయిడెడ్, కెేజీబీవీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్ రీయింబర్స్ మెంట్ పరిమితి ఐదులక్షలకు పెంచాలని వినతిపత్రం సమర్పించారు.