Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాముగా కమలాకర్
నవతెలంగాణ-జన్నారం
సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సీపీఎస్్ రాష్ట్ర అధ్యక్షుడు దాముగా కమలాకర్ అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని పీఆర్టీయూ భవన్లో ఏర్పాటు చేసిన సీపీఎస్ సమావేశంలో మాట్లాడారు. రాజస్తాన్, పంజాబ్, ఛత్తీస్‌ఘడ్, ఝార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్‌ను అందిస్తున్న విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు వల్ల రూ.2లక్షల సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయకపోతే, ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో సీపీఎస్ ఉద్యోగుల మహాగర్జన నిర్వహిస్తామని తెలిపారు. సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలను, పీఆర్సీ ఎరియర్స్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు గోళ్లు గంగన్న, గుమ్మడి ఆయాన్, రమేష్, కాంతయ్య, షఫీక్, రాజయ్య పాల్గొన్నారు.