Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ
నవతెలంగాణ-నల్లగొండ
సమానత్వ సాధన కోసం మహిళలందరూ ఐక్యంగా ఉద్యమించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండ జిల్లాకేంద్రంలోని 25వ వార్డు అబ్బాసియాకాలనీలో ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గులపోటీలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలలోనూ ముందుండాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభావతి మాట్లాడుతూ మహిళలలో ఉన్న సృజనాత్మకను వెలికి తీయడానికే ప్రతిఏడాది ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళా సమస్యలు ఎక్కడ ఉన్నా వారికి అండగా ఐద్వా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి, కమిటీ సభ్యులు విజయ, తదితరులు పాల్గొన్నారు.