Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గంగుల మల్లయ్యకు నివాళి
నవతెలంగాణ - కరీంనగర్
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య పెద్దకర్మ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజర య్యారు. సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కొండ సత్య లక్ష్మణ్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ హాజరై గంగుల మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గంగుల కమలాకర్ ను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రణా ళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, వొడితెల సతీష్ బాబు, రసమయి బాలకిషన్, సంజరు కుమార్, సుంకే రవిశంకర్, కోరుకంటి చందర్, జెడ్పీ చైర్పర్సన్ కనుమళ్ల విజయ, పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్ పుట్ట మధు, మాజీ ఎమ్మెల్సీ లు నారదాసు లక్ష్మణ్‌రావు, కె.సత్యనారాయణ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కార్పొరేషన్ చైర్మెన్లు సర్దార్ రవీందర్ సింగ్, దామోదర్ గుప్తా, బండ శ్రీనివాస్, అనిల్ కూర్మాచలం, నగర మేయర్ సునీల్ రావు, కలెక్టర్ కర్ణన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ పొన్నం అనిల్ గౌడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణ, కార్యదర్శి రూప్ సింగ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఓరుగంటి ఆనంద్, చల్లా హరిశంకర్, కరీంనగర్ కార్పొరేటర్లు పాల్గొన్నారు.