Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
ఇటీవల వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన నగదు దోపిడీ కేసును పోలీసులు చేధించారు. నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 18 లక్షల నగదు, కారు, బైక్, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహన్ తెలిపారు. సోమవారం ఎల్బీనగర్లో సీపీ క్యాంప్ కార్యాలయంలో వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. నిందితులు విదేశాలకు పారిపోవడం కోసం పత్రాలు తెచ్చుకునేందుకు చార్మినార్‌కు వెళ్తున్న క్రమంలో ఇంజాపూర్ కమాన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు రహీం ఘోరీ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ జోన్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, క్రైమ్ డీసీపీ బాల, ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఎస్ ఓటీ అడిషనల్ డీసీపీ శ్రీనివాసులు, ఎస్ఓటీ ఏసీపీ వెంకన్న, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, ఇన్స్పెక్టర్లు సత్య నారాయణ, సుధాకర్, యాదయ్య, రాములు, రంగా, అర్జునయ్య, మన్ మోహన్, రవి కుమార్, అశోక్ కుమార్, సైదులు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
నేరం జరిగిన విధానం..
ఆటోనగర్‌లో ఎంఆర్ఆర్ వైన్స్ యజమాని వెంకట్‌రెడ్డి, భవానినగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ హమీద్ అలియాస్ నయీమ్‌లు స్నేహితులు. నయీ మ్ తన వ్యాపారం కోసం వెంకట్ రెడ్డి వద్ద రూ.50 లక్షలు అప్పుగా తీసుకు న్నాడు. అది చెల్లించి అట్టి మొత్తాన్ని దొంగిలిద్దామని తన స్నేహితులు రహీం ఘోరీ, ఒమర్ బిన్ హంజా అల్ జాబ్రీ అలియాస్ అలీ, అలీ బిన్ హంజా అలీ జాబ్రీ అలియాస్ అలీతో కలిసి పథకం రచించాడు. ఈ మేరకు వెంకట్ రెడ్డికి నయీమ్ ఫోన్ చేసి అప్పు మొత్తం తిరిగి ఇస్తాననగా.. వెంకట్ రెడ్డి తన వైన్స్ వద్దకు వచ్చి ఇవ్వాలని చెప్పాడు. అనంతరం ఆ ప్రదేశాన్ని నయీమ్ తన స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంపై పలు మార్లు రెక్కి నిర్వ హించాడు. ఈ నెల 6న రూ. 50 లక్షల నగదును నయీమ్.. అలీతో కలిసి బైక్‌పై వైఎంఆర్ ఆర్ వైన్స్ వద్దకు వెళ్లి వెంకట్‌రెడ్డికి అందజేశాడు. అదే సమయంలో పనామా వద్ద ఉన్న పిస్తా హౌస్ వద్ద రహీం ఘోరీ, ఒమర్ ఉన్నారు. ఆ డబ్బులు తీసు కున్న వెంకట్ రెడ్డి తన వద్ద పనిచేసే వ్యక్తితో కలిసి అక్కడి నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో కమలానగర్ సాయి బాబా గుడి వద్దకు రాగానే రహీం ఘోరీ, ఒమర్ వారిపై దాడి చేసి ఆ డబ్బును దోచుకునే ప్రయత్నం చేశారు. దాంతో చుట్టుపక్కల వారు అటుగా రావడంతో నిందితులు రూ. 25 లక్షలను మాత్రం దోచుకుని పరారయ్యారు. ఆ తరువాత నిందితులు ముంబైకు పారిపోయారు. తర్వాత దుబారుకు వెళ్లిపోవాలని నిందితులు ట్రావెల్స్‌లో పనిచేస్తున్న చార్మినార్‌కు చెందిన ఫహన్ బీన్ అబ్దుల్ రహేమాన్ అలియాస్ ఫహాద్‌ను సంప్రదించారు. ఇదిలా ఉండగా ప్రత్యేక టీంలు సీసీఎస్, ఎస్ ఓటీ, వనస్థలిపురం క్రైమ్ టీంల సహకారంతో సీసీ కెమె రాల నిఘా ఆధారంగా నలుగురు నిందితులను ఇంజాపూర్ కమాన్ వద్ద అరెస్టు చేశారు.