Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీపీ అధ్యక్షులు కాసాని
నవతెలంగాణ-హైదరాబాద్
నాయీబ్రహ్మణులకే మొట్ట మొదటి అసెంబ్లీ టికెట్‌ను కేటా యిస్తామని టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వివిధ నాయీబ్రహ్మణ సంఘాల ప్రతినిధులు కాసాని కలిశారు. ఈసందర్భంగా మంగళ వాయిద్యాలతో కాసానిని ఘనంగా సన్మానించారు. తమకు తొలి టికెట్‌ను తమకు ఇస్తామని చెప్పినం దుకు ధన్యవాదాలు, కతజ్ఞతలు తెలిపారు. అనంతరం జరిగిన సభకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎఎస్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా నాయీబ్రహ్మణులను అసెం బ్లీకి వెళ్లే అవకాశం ఇవ్వలేదన్నారు. మొట్టమొదటగా టీడీపీ అసెంబ్లీ సీటును కేటాయించడమే కాక 119 అసెంబ్లీ సీట్లలో మొట్టమొదటి సీటు ను వాని అభ్యర్థినే ప్రకటిస్తామన్నా రు. గ్రామాలలో 12 కులాల వారు ఉంటారనీ, వీరిలో మొదటగా నాయీబ్రహ్మణులకు అసెంబ్లీ సీటు ను ఇవ్వనున్నట్టు వివరించారు. మిగి లిన 11 కులాల వారికి కూడా రాబో యే రోజులలో ప్రకటిస్తామన్నారు. ప్రతి కులానికి శాసనసభలో ప్రాతి నిథ్యం ఉండాలనేదే మా ఉద్దేశ్య మ న్నారు. ఈ మేరకు జాతీయ పార్టీ అ ధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దష్టికి తీసుకెళ్లగా ఆయన వెంట నే అంగీకరించారని చెప్పారు. తెలుగు దేశం అంటేనే బడుగు, బల హీన, వర్గాల పార్టీ అని, స్థానిక సం స్థలలో మహానుభావుడు ఎన్టీఆర్ బీసీ లకు రిజర్వేషన్లు మొట్టమొదటి సారి గా కల్పించారని చెప్పారు. ఈ అవకా శం వల్ల చంద్రబాబు హయాం లో జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఐదేండ్లు పని చేసే అవకాశం నాకు కలిగిందని అన్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు అజ్మీరా రాజునాయక్, షేక్, కార్యదర్శి కనగాల శేఖర్, నాయీబ్రహ్మణ సంఘాల రాష్ట్ర నాయకులు నరేం దర్, పాల్వాయి శ్రీనివాస్, జగదీష్ , లింగం, వినోద్, రమేష్ , సిద్ధులు ,మహేందర్, దశరథ్, రాకేష్ , శ్రీధర్ పాల్గొన్నారు.