Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నాగర్‌కర్నూల్ జిల్లాలోని మార్కండేయ ప్రాజెక్టును నిర్మిస్తామంటూ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని టీపీసీసీ సీనియర్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి విమర్శించారు. ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం తట్టెడు మట్టిని ఎత్తలేదని చెప్పారు. ఆ ప్రాజెక్టు భూ నిర్వాసితులు పరిహారమివ్వాలంటూ కోరితే వారిపై దాడులకు పాల్పడ్డారని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నాయకులు సంపత్‌కుమార్, మల్లు రవి, జగన్ నాయక్,చామల కిరణ్ కుమార్రెడి, మెట్టు సాయి కుమార్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకే మార్కండేయ ప్రాజెక్ట్ హామీ ఇచ్చారని చెప్పారు. ఆ ప్రాజెక్టు సందర్శనకు వెళితే తమను అడ్డుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడిచేసి గొంతుపై కాలుపెట్టి చంపే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ కార్యకర్తలపై దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు. తిరిగి మాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు.