Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
క్యూబాపై అమెరికా యొక్క ఆంక్షలు, చట్టవిరుద్ధమైన, అమానవీయ దిగ్బంధనాన్ని ప్రతి ఒక్కరు ప్రతిఘటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీఎస్. బోస్, ఈటీ. నరసింహలు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరగనున్న క్యూబా సంఘీభావ సభకు ముఖ్యఅతిథులుగా విచ్చేస్తున్న విప్లవ యోధుడు చేగువేరా కూతురు డా.ఆలైద గువేరా, మనువరాలు ప్రో. ఏస్థిఫీనా గువేరాల స్వాగత కటౌట్లను హైదరాబాద్, హిమాయత్ నగర్, సత్యనారాయణ రెడ్డి భవన్ వద్ద వి.ఎస్. బోస్, ఈ.టి.నరసింహలు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వి.ఎస్. బోస్ మాట్లాడుతూ అమెరికా క్యూబాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, అంతర్గత విధ్వంసం సృష్టించడం దారుణమని విమర్శించారు. నరసింహ మాట్లాడుతూ సామ్యవాద, ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులు, రాజకీయ పార్టీలు ఏకమై ఈ నెల 22న హైదరాబాద్, రవీంద్రభారతిలో క్యూబా సంఘీభావ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.