Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలి
- కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అపిడవిట్ దాఖలు చేయాలి: తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారత రాజ్యాంగం ఐదో షెడ్యూల్లో భాగంగా గిరిజనులకు కల్పించిన 1/70 చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్రానికి చెందిన సూరెడ్డి రమణారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారనీ, దీనిపౖౖె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ అపిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాంనాయక్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగం కల్పించిన ఐదో షెడ్యూల్డ్ హక్కులను రద్దు చేసేందుకు కుట్రలు చేస్తున్నదని పేర్కొన్నారు.. ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే భాష నినాదాలతో ముందుకు పోతున్నదని తెలిపారు. అందుకు ఆటంకమైన చట్టాలన్నింటిని రద్దు చేయాలని పూనుకున్నదని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రాంతంలో స్థానిక గిరిజనులకు 100శాతం విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న జీవో నెంబర్ 3 ని న్యాయస్థానం ద్వారా రద్దు చేయించిందని తెలిపారు. అటవీ సంరక్షణ నియమాలు2022 పేరుతో పెసా 'చట్టాన్ని రద్దు చేసేందుకు వచ్చే పార్లమెంట్లో చట్టం చేయబోతున్నదని పేర్కొన్నారు. బీజేపీ మద్దతుదారులే 1/70 చట్టాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని తెలిపారు.