Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, న్యూజిలాండ్ ఢీ నేడు
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐదు నెలల వ్యవధిలోనే హైదరాబాద్ మరోసారి అంతర్జాతీయ క్రికెట్ సందడికి వేదికైంది. సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్ జరుగగా.. తాజాగా న్యూజిలాండ్‌తో వన్డే సమరానికి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా నిలువనుంది. హైదరాబాద్ వన్డే ధమాకా కోసం న్యూజిలాండ్ జట్టు మూడు రోజుల ముందే నగరానికి చేరుకోగా.. భారత జట్టు సోమవారం ఇక్కడికి చేరుకుంది. వన్డే ధమాకా ముంగిట మంగళవారం ఇరు జట్లు సెషన్ల వారీగా ప్రాక్టీస్ సెషన్లో చెమటోడ్చాయి. ఉప్పల్ స్టేడియం ఇప్పటివరకు ఆరు వన్డేలకు ఆతిథ్యం వహించగా.. ఇది ఇక్కడ జరుగనున్న ఏడో వన్డే పోరు కానుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భారత్, న్యూజిలాండ్ వన్డే మ్యాచ్‌కు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి హెచ్‌సీఏ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. సుమారు 2500 మంది పోలీసులతో వన్డే మ్యాచ్‌కు భద్రత ఏర్పాటు చేశారు. వన్డే మ్యాచ్‌కు అందుబాటులో ఉన్న సుమారు 40 వేల టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుకావటంతో నేడు వన్డే పోరుకు స్టేడియం పూర్తిగా నిండనుంది.