Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాస్టర్ ప్లాన్ రద్దు చేయాల్సిందే : ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్
- 20న విప్ ఇంటి ముట్టడి
నవతెలంగాణ-కామారెడ్డి టౌన్
భూ సేకరణ చట్టం-2013 ప్రకారం భూములు సేకరించేందుకు 80 శాతం మంది రైతులు అంగీకరించాల్సి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం రకరకాల జోన్ల పేరుతో రైతులను ఇక్కట్లు పెట్టి వారి భూములు లాక్కొని కంపెనీలకు కట్టబెడుతోందని ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. దాంట్లో భాగంగానే కామారెడ్డి, జగిత్యా లలో మొదటి విడుతగా అమలు చేసేందుకు యత్నిస్తుందని చెప్పారు. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్యకార్యా చరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కామారెడ్డి జిల్లా పాతం రాజంపేట్లో ఏర్పాటుచేసిన సమా వేశానికి సారంపల్లి మల్లారెడ్డి హాజరై మాట్లాడారు. మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేయాలని, కంపెనీలు పెట్టేం దుకు కామారెడ్డిలో తాము భూములు చూపిస్తామని చెప్పారు. భూములు రక్షించుకోవడం కోసం రైతులకు అండగా ఏఐకేఎస్ పోరాడుతోందని తెలిపారు. ఉద్యమాలను ఉధృతం చేస్తే ప్రభుత్వం దిగిరాక తప్పదని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోతి రామ్ నాయక్, మల్లేష్, నర్సింలు, కమ్మరి సాయిలు, మధు, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
20న విప్ ఇంటి ముట్టడి
మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేయకుంటే ఈ నెల 20వ తేదీన ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ ఇంటి ముట్టడికి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తీర్మానం చేసింది. మంగళవారమిక్కడ సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై పలు తీర్మానాలు చేశారు. గుంట భూమి కూడా రైతులకు నష్టం కలిగించే ప్రసక్తే లేదని చెప్తున్న కలెక్టర్, కమిషనర్, ఎమ్మెల్యే మాట ప్రకారం ఈ నెల 19 వరకు మున్సిపల్ సర్వసభ్య సమావేశం పెట్టి మాస్టర్ ప్లాన్ రద్దుకు తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే 19వ తేదీ 3 గంటల వరకు విలీన గ్రామాలకు చెందిన 9 మంది కౌన్సిలర్లు రైతులకు మద్దతుగా, మాస్టర్ప్లాన్కి వ్యతిరేకంగా రాజీనామా చేయాలని కోరారు. ఒక వేళ ఎవరైనా రాజీనామా చేయకపోతే వారిపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుం టామని, తమతో కలిసి వచ్చిన కౌన్సిలర్లతో కమిషనర్‌కు రాజీనామా ఇస్తామని అన్నారు.