Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భగత్ సింగ్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలి
- డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్
నవ తెలంగాణ- కొల్లాపూర్ రూరల్.
కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఇస్తానన్న రెండు కోట్ల ఉద్యోగాలు జాడ ఎక్కడని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామం బస్టాండ్ చౌరస్తాలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ), భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మంగళవారం భగత్ సింగ్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భగత్ సింగ్ చిత్రపటానికి గ్రామ సర్పంచ్ దశరథం నాయక్, డీివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేష్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సమగ్రత, సమైక్యత కోసం, సమాన విద్యా ఉపాధి అవకాశాల కోసం భగత్‌సింగ్ తన జీవితాన్ని బలిదానం చేశారని గుర్తుచేశారు. నేటి పాలకులు వాటిని తుంగలో తొక్కి కులమతాల పేరుతో రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగాల కల్పించకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో భగత్ సింగ్‌ను ఆదర్శంగా తీసుకొని యువత పోరాట మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి శివవర్మ, యూటీఎఫ్ సీనియర్ నాయకులు లక్ష్మణ్ నాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం తారాసింగ్, తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి బాలపిరు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి భాస్కర్ నాయక్, మాజీ ఉపసర్పంచ్ చంద్ర నాయక్,సేవ్య నాయక్, మత్స్య కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.