Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోషల్ మీడియా ఇన్ప్లూయన్సర్స్ జాబితాలో చోటు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రి కేటీఆర్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే టాప్ సోషల్మీడియా ఇన్ఫ్లూయన్సర్స్్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వరల్డ్ టాప్ 30 ఇన్ఫ్లూయన్సర్స్ జాబితాలో మన దేశం నుంచి ఇద్దరు యువనేతలకు మాత్రమే చోటు దక్కడం విశేషం. అందులో ఒకరు మంత్రి కేటీఆర్ కాగా, మరొకరు ఎంపీ రాఘవ్ చద్దా. అయితే ఈ జాబితాలో ఎంపీ కంటే మంత్రి కేటీఆరే ముందు వరుసలో నిలబడటం గమనార్హం. అటు అఫిషియల్, ఇటు పర్సనల్ అకౌంట్... రెండింటిలోనూ మంత్రి కేటీఆర్ అగ్రస్థానంలో నిలిచారు. ఈ జాబితాలో మంత్రి కేటీఆర్ 12వ స్థానాన్ని దక్కించుకున్నారు. రాఘవ్ చద్దా 23వ స్థానంలో నిలిచారు. కాగా, తెలంగాణ ఐటీ శాఖకు చెందిన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ 22వ స్థానాన్ని దక్కించుకుంది. ఐటీ శాఖ మంత్రిగా ఆ రంగం పురోభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్...సోషల్ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటారు.