Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భూ విజ్ఞాన శాస్త్రవేత్తల కోసం భౌగోళిక సమాచార వ్యవస్థపై 14వ అంతర్జాతీయ కోర్సును హైదరాబాద్ లోని భూవైజ్ఞానిక సర్వే శిక్షణా సంస్థ (జీఎస్ఐటీఐ) ప్రారంభించింది. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో హెడ్ మిషన్ 5 డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సీహెచ్.వెంకటేశ్వరరావు, డీడీజీ డాక్టర్ మాథ్యూ జోసెఫ్, కోర్స్ కో ఆర్డినేటర్ డాక్టర్ బిభాస్ సేన్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి ఒకటి వరకు శిక్షణ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఉద్దేశించిన ఈ కోర్సులో 10 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు.