Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రేమ జంటలే టార్గెట్
- బెదిరించి లైంగిక దాడులు చేసిన నిందితుడు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఒంటరిగా కనిపించిన ప్రేమ జంటలను, స్నేహితులను టార్గెట్ చేసుకుని, వారిని బెదిరించి యువతులపై లైంగిక దాడి చేసిన జవాన్‌కు స్పెషల్ కోర్టు శిక్ష విధించింది. నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ.2లక్షల జరిమానాను స్పెషల్‌కోర్టు న్యాయమూర్తి విధించారు. బుధవారం జాయింట్ సీపీ ఘజారావు భూపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. బ్రిజీస్ కుమార్ యాదవ్ సింగల్ రెజిమెంటరీ వద్ద జవాన్‌గా విధులు నిర్వహించేవాడు. హైదరాబాద్‌లోని అమ్ముగూడ రైల్వేస్టేషన్, కంటోన్మెంట్‌లోని నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా కనిపించే ప్రేమ జంటలను, స్నేహితులను(అమ్మాయి, అబ్బాయి) టార్గెట్ చేసేవాడు. వారిపై దాడిచేసేవాడు. యువకున్ని చితకబాది, యువతులపై లైంగిక దాడి చేసేవాడు. ఇదే తరహాలో డిసెంబర్ 21, 2017లో ఓ బాలికపై లైంగిక దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదులో నిందితుడిపై కేసు నమోదైంది. బాధితులను భరోసా సెంటర్‌కు తరలించిన పోలీసులు అన్ని వివరాలు సేకరించి.. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. అనంతరం బెయిల్‌పై వచ్చిన నిందితుడు 2018లో మరో బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టాడు బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు వివరాలను కోర్టుకు సమర్పించారు. సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు.. నిందితుడికి 20ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ.2లక్షల జరిమానా విధించింది.