Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ-కొణిజర్ల
తెలంగాణలో ఉన్న భూములు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయని, వాటిని సాగు చేసే రైతులకు మంచి భవిష్యత్ ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో దొడ్డపనేని వెంకటేశ్వరరావు తన 12 ఎకరాల భూమిలో సాగుచేస్తున్న పామాయిల్ పంటను పరిశీలించి అభినందించారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో పామాయిల్ రైతులకు ప్రోత్సాహకాలు అందజేస్తు న్నారని చెప్పారు. ఏడాదికి 22 మిలియన్ టన్నుల నూనె దేశానికి అవసరం కాగా కేవలం ఏడు మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు. ప్రతియేటా 90 వేల కోట్ల పామాయిల్ దిగుమతి అవుతుందని, పామాయిల్ సాగుతో పాటు నువ్వులు, కుసుమ, వేరుశనగ తదితర నూనె గింజల సాగుకు ప్రోత్సాహకాలు, ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లులు ఏర్పాటు కోసం 458 ఎకరాల భూసేకరణ కార్య క్రమాన్ని చేపట్టామన్నారు. అదే విధంగా రాబోయే ఏడాదికి కోటి ఆయిల్ పామ్ మొక్కలు సరఫరా చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.