Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్థంతి సందర్భంగా లెజండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమం బుధవారం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలోనేగాక దేశవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తెచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకే తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని తెలిపారు. తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ 27వ వర్థంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమన్నారు. బుధవారం నుంచి 30 రోజులపాటు వివిధ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు జరుగుతాయన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని బడుగు, బలహీన వర్గాలకు ఎప్పుడూ అండగా ఉంటుందని కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు.