Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షులు తోట చంద్రశేఖర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనీ, వాటిని మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ బుధ వారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. చిల్లర రాజకీయాల కోసమే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ బహిరంగ సభ నుంచి మీడియా దృష్టి మళ్లించేందుకు ఇలాంటి చిల్లర ఎత్తుగడలని పేర్కొన్నారు. రఘునందన్ రావు ఆరోపణల్లో నిజముంటే.. ఆ సర్వే నెంబర్ భూమిలో 90 శాతం ఎమ్మెల్యే తీసుకోవచ్చని తెలిపారు. బీఆర్ఎస్ పట్ల అక్కసుతోనే ఇలాంటి పనికి మాలిన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర కీలకం కానుందని తెలిపారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కేసీఆర్ భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.