Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్కు ప్రయాణీకుల నుంచి సానుకూల స్పందన లభించిందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి మూడు రోజులకు గాను 100 శాతం కంటే ఎక్కువ సామర్థ్యంతో నడిచిందని పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రయాణానికి, మొదటి మూడు రోజులు సగటు ఆక్యుపెన్సీ మొదటి రోజు 99శాతం, రెండో రోజు 144శాతం, మూడో రోజు 149శాతంగా ఉందని తెలిపారు.
సరుకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు : తొమ్మిది
నెలల 16 రోజుల్లో రూ.10 వేల కోట్ల రాబడి
సరుకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు సాధించింది. కేవలం తొమ్మిది నెలల 16 రోజుల్లో రూ.10 వేల కోట్ల రాబడిని దాటింది. గతంలో 2019 మార్చి తొమ్మిది నాటికి 343 రోజుల్లో రూ.10 వేల కోట్ల రాబడి రికార్డును దీంతో అధిగమించినట్టైంది. 100 మిలియన్ టన్నుల లోడింగ్ మార్కును సైతం దాటడం విశేషం. సరుకు రవాణాలో 50 శాతం బొగ్గు, సిమెంట్ 26 శాతం, దాదాపు 11 శాతం ఆహార ధాన్యాలు, ఎరువులుంటున్నాయి. రికార్డు స్థాయి రాబడి వచ్చేందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అభినందనలు తెలిపారు.