Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ధూల్‌పేట్
టర్కీ ఇస్తాంబులో మరణించిన 8వ నిజాం నవాబ్ మీర్ బర్కత్ అలీఖాన్ ముఖరం జా అంత్యక్రియ లు అధికారిక లాంఛనాలతో బుధవారం మక్కా మసీదులో జరిగాయి. చౌమహల్లా ప్యాలెస్‌లో భారీ బందోబస్తు మధ్య గౌరవ వందనం అనంతరం మక్కా మసీదు వరకు అంతిమయాత్ర కొనసాగింది. దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య పర్యవేక్షణలో ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. పలువురు నివాళులర్పించారు. మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థన అనంతరం మృతదేహాన్ని సమాధి చేశారు. తండ్రి సమాధి పక్కనే తన సమాధిని పెట్టాలన్న ఆయన కోరిక మేరకు చేశారు. అంతిమయాత్రలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే లు భాషా ఖాద్రి, ముంతాజ్ ఆహమద్ ఖాన్, మేరాజ్ హుస్సేన్, ఎమ్మెల్సీ రియాజ్ హాసన్, కార్పొరేటర్లు, నిజాం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మొదటి, ఏడో నిజాం మినహా మిగతా ఐదుగురు నిజాం నవాబుల సమాధులు మక్కా మసీద్ లోనే ఉన్నాయి. మొదటి నిజాం మీర్ కమర్ ఉద్ దిన్ ఖాన్ సమాధి ఔరాంగా బాద్‌లో, 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సమాధి కింగ్ కోఠి మజీద్‌లో ఉంది. ఎనిమిదో నిజం అంత్యక్రియల సందర్భంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో, ప్రత్యేక వ్యాపార కూడళ్లలో దుకాణాలు బంద్ చేశారు. చార్మినార్ మీదుగా వెళ్లాల్సి న ఆర్టిసీ బస్సులను, వాహనాలను అఫ్జల్‌గంజ్, మదిన, శాలిబండ జహానుమ మీదుగా మళ్లించారు.