Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ అధికారులకు యూఎస్పీసీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయులందరికీ బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనను బుధవారం హైదరాబాద్‌లో యూఎస్పీసీ ప్రతినిధులతో సమా వేశాన్ని నిర్వహించారు. ఇందులో పాఠశాల విద్యా శాఖ అదనపు సంచాలకులు కె లింగయ్య, యూఎస్పీసీ నాయకులు కె జంగయ్య, చావ రవి, వై అశోక్ కుమార్, ఎం రవీందర్, టి లింగారెడ్డి, షౌకత్ అలీ, మసూద్ అహ్మద్, ఎన్ యాదగిరి, మోయిన్, లక్ష్మారెడ్డి, వినోద్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయటానికి 34/35 రోజులు సమయం పడుతుం దంటూ అంశాల వారీగా వారు చర్చించారు. సోమవారం/ మంగళవారం షెడ్యూల్ అధికారికంగా విడుదల చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. 13 జిల్లాల స్పౌజ్ బదిలీలను షెడ్యూల్ విడుదలకు ముందే పూర్తి చేయాలని కోరారు. జిల్లాలోని అన్ని ఖాళీలనూ బదిలీలకు చూపించాలని తెలిపారు. బదిలీలకు కటాఫ్ తేదీ డిసెంబర్ 31 లేదా జనవరి 31 గా నిర్ణయించాలని పేర్కొన్నారు. బదిలీ అనంతరం అందరినీ కొత్త పాఠశాలల్లో రిపోర్ట్ చేసి తిరిగి డెప్యుటేషన్‌పై ప్రస్తుత పాఠశాలలో రిలీవర్ వచ్చేవరకు కొనసాగేలా ఉత్తర్వులివ్వాలని తెలిపారు. 2018 బదిలీల్లో అధికారుల పొరపాటు కారణంగా బైపోస్ట్/ లీన్ పోస్ట్‌లో కొనసాగుతున్న ఉపాధ్యాయులను బదిలీలకు ముందుగానే ఒరిజినల్ పోస్టుల్లో సర్దుబాటు చేయాలని సూచించారు. మూత్రపిండాల వ్యాధితో బాధ పడుతున్న డయాలసిస్ పేషెంట్లను, మస్క్యులర్ డిస్ట్రోఫీ తదితర అరుదైన జబ్బులను ప్రిఫరెన్షియల్ కేటగిరీలో చేర్చాలని తెలిపారు. బదిలీలు, పదోన్నతు ల సీనియార్టీ జాబితాల్లో లోపాలు లేకుండా తయా రు చేయించాలని పేర్కొన్నారు. అప్పీళ్లకు తగిన సమయమివ్వాలని తెలిపారు. వాటన్నింటినీ పరి ష్కారం చేసి తుది జాబితా ప్రకటించాలని సూచిం చారు. రెండు, మూడు జిల్లాల్లోని మండలాల తో ఏర్పడిన నూతన జిల్లాల్లో ఇంటర్ - సే - సీని యారిటీ జాబితాలు తయారు చేయటానికి డీఈఓ లకు స్పష్టమైన మార్గదర్శకాలివ్వాలని కోరారు. ప్రభుత్వ అనుమతితో విదేశాల కు వెళ్లిన ఉపాధ్యా యుల ఆన్లైన్ దరఖాస్తులను హార్డ్ కాపీ లేకున్నా అనుమతించాలనీ, లేదంటే ఆథరైజేషన్‌ను అంగీక రించాలని కోరారు. 2018 బదిలీల్లో స్వల్ప పొర పాట్లకు కారణమైన సాఫ్ట్‌వేర్‌ను తాజా పరచాలని వివరించారు. ఎన్సీసీ, స్పౌజ్ తదితర కేటగిరీ ఉపాధ్యాయులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఈసారి బదిలీల్లో ఎదురు కాకుండా చూడాలని తెలిపారు.
మాన్యువల్‌గా కౌన్సెలింగ్ జరపాలి : పీఆర్టీయూటీఎస్
బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించి సీనియార్టీ, మెరిట్ జాబితాలు రూపొందించిన తర్వాత మాన్యువల్‌గా కౌన్సెలింగ్ నిర్వహించాలని పీఆర్టీయూటీఎస్ కోరింది. ఈ మేరకు శ్రీదేవసేనను ఆ సంఘం అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. బదిలీకోసం రెండేండ్ల నిబంధనను తొలగించి అందరికీ అవకాశం కల్పించా లని కోరారు. బదిలీలు, పదోన్నతులకు అన్ని ఖాళీల నూ పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
బదిలీకి జీరో సర్వీసు ఉన్నా అవకాశమివ్వాలి : జాక్టో
బదిలీ కోసం కనీస సర్వీసు రెండేండ్ల నుంచి జీరో సర్వీసుకు తగ్గించి అవకాశం కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేసింది. ఈ మేరకు శ్రీదేవసేనను జాక్టో ప్రతినిధులు జి సదానందంగౌడ్, ఎం పర్వత్‌రెడ్డి, ఎం రాధాకృష్ణ, కె కృష్ణుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి బి భుజంగరావు కలిసి వినతిపత్రం సమర్పించారు. 317 జీవో బాధిత ఉపాధ్యాయులకు బదిలీల్లో ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి స్థానిక జిల్లాలకు వచ్చేలా అవకాశం కల్పించేలా మార్గాలను చూపాలని కోరారు.
రాష్ట్రపతి ఉత్తర్వులు-1975 ప్రకారం జరగాలి : ఎల్సీజీటీఏ
రాష్ట్రపతి ఉత్తర్వులు-2018పైన హైకోర్టులో స్టే ఉన్న కారణంగా రాష్ట్రపతి ఉత్తర్వులు-1975 ప్రకారం పదోన్నతులు, బదిలీలు జరిగితే ఎటువంటి న్యాయ సంబంధమైన ఇబ్బందులు రావని లోకల్ క్యాడర్ గవర్నమెంట్ టీచర్ అసోసియేషన్ (ఎల్సీజీటీఏ) ప్రభుత్వానికి సూచించింది. ఈమేరకు విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనను ఎల్సీజీటీఏ అధ్యక్షులు ఎం వీరాచారి, న్యాయ సలహాదారులు సానా సురేందర్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎస్ రవీందర్ కలిసి వినతిపత్రం సమర్పించారు. 317 జీవో అమలులో భాగంగా హైదరాబాద్ జిల్లాకు వచ్చిన గెజిటెడ్ హెచ్ఎం గ్రేడ్-2 వారిని వారి జోన్లకు పంపించాలని కోరారు.