Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ వన్డేలో భారత్ గెలుపు
- సిరీస్‌లో 1-0 ఆధిక్యం
నవతెలంగాణ, హైదరాబాద్ :
ఉప్పల్‌లో ఊచకోత. శుభ్‌మన్ గిల్ (208, 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లు) కివీస్ బౌలర్లపై విశ్వరూపం చూపించాడు. ఫుల్‌షాట్లు, సిక్సర్ల మోతతో ఉప్పల్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ నమోదు చేశాడు. 145 బంతుల్లోనే 200 పరుగులు బాదిన గిల్ వన్డే క్రికెట్లో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా ఇషాన్ కిషన్ రికార్డును బద్దలుకొట్టాడు. శుభ్‌మన్ గిల్ ద్వి శతకానికి తోడు హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (4/46) మెరవటంతో భారత్ 12 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై గెలుపొందింది. 350 పరుగుల ఛేదనలో బ్రాస్‌వెల్ (140) శతకంతో న్యూజిలాండ్ 337 పరుగులు చేసింది.