Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలోనూ ఇద్దరు ఉపాధ్యాయులుండాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ (ఎస్జీటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) వి శాంతికుమారిని గురువారం హైదరాబాద్‌లో ఆ సంఘం అధ్యక్షులు కరివేద మహిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ఒక ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేయాలని సూచించారు. తరగతికి ఒక గది, టీచర్, ప్రధానోపాధ్యాయుడిని నియమించాలని కోరారు. అప్పుడే ఎఫ్ఎల్ఎన్ ఆశించిన లక్ష్యాలను సాధిస్తుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగా పది వేల పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేయాలని కోరుతూ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మెన్ శ్రీధర్‌రెడ్డి, విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనను వేర్వేరుగా కలిసి విజ్ఞప్తి చేశారు.