Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 317 జీవో బాధిత ఉపాధ్యాయులకు బదిలీల్లో ప్రాధాన్యత కల్పించాలని తపస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఎస్ వి శాంతికుమారిని గురువారం హైదరాబాద్లో ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంతరావు, నవాత్ సురేష్ కలిసి వినతిపత్రం సమర్పించారు. కోర్టు ద్వారా న్యాయమైన వ్యక్తిగతంగా వచ్చిన అప్పీళ్లను తక్షణమే పరిష్కరించి షెడ్యూల్ను ప్రకటించాలని కోరారు. బదిలీలు, పదోన్నతులు ఆన్లైన్ ద్వారా వెబ్కౌన్సెలింగ్లో ఆప్షన్లలో పొరపాట్లు జరిగితే ఎడిట్ ఆప్షన్ కల్పించాలని సూచించారు. బదిలీలతోపాటు పదోన్నతులకు కూడా నాట్ విల్లింగ్ ఆప్షన్ను పొందుపరచాలని తెలిపారు. జీరో సర్వీసు కింద ఉపాధ్యాయులందరికీ బదిలీ అవకాశం కల్పించాలని కోరారు.