Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్‌కు టీపీటీఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న మూడు విడతల కరువు భత్యం (డీఏ)ను విడుదల చేయాలని టీపీటీఎఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) వి శాంతికుమారిని గురువారం హైదరాబాద్‌లో ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై అశోక్ కుమార్, ముత్యాల రవీందర్ కలిసి వినతిపత్రం సమర్పించారు. పెండింగ్‌లో ఉన్న వివిధ ఆర్థిక బిల్లుల మంజూరులో క్రమపద్ధతి పాటించాలనీ, జాప్యాన్ని నివారించాలని కోరారు. 317 జీవోకు సంబంధించి అన్ని రకాల ఆప్పీళ్లనూ పరిష్కరించి బదిలీలు చేపట్టాలని సూచించారు. పీఆర్సీ-2020లో జారీ కానీ ప్రత్యేక అలవెన్సులు, కన్వెయన్స్ అలవెన్స్, ఏజెన్సీ అలవెన్సు, చైల్డ్ కేర్ లీవ్ తదితర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. సీఎస్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.