Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోధన్
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో తెలుగు ఉపాధ్యా యుడు మల్లికార్జున్ విధుల్లో ఉన్నప్పు డు కొంతమంది వ్యక్తులు బలవంతం గా గుడిలోకి తీసుకెళ్లి బొట్టుపెట్టి అవమానించిన ఘటనలో 10 మంది పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోటగిరి పోలీస్ స్టేషన్లో మల్లికార్జున్ ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై విచారించిన ఏసీపీ కిరణ్ కుమార్ పదిమందిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ముగ్గురు రమేష్, సాయిబాబు, వర్షిత్ ను అరెస్టు చేయగా.. గురువారం కాపుగాండ్ల శ్రీనివాస్ అలియాస్ గాండ్ల శ్రీను, పబ్బ శేఖర్, గాండ్ల గోపి, పార్వతి మురళి, మామిడి శ్రీనివాస్ అలియాస్ శ్రీను, ఎడ్డెడి రాజు అలియాస్ డాన్, మామిడి నవీన్ అరెస్టు చేసినట్టు ఏసీపీ తెలిపారు.