Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి పువ్వాడ అజయ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఖమ్మంలో బీఆర్ఎస్ సభ విజయ వంతమైందనీ, ఆ సభ దేశంలో ప్రగతిశీ లశక్తుల కలయికకు బాటలు వేసిందని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. గురువారం హైదరాబాద్ బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో నిర్వహిం చిన మీడియా సమావేశంలో రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవి చంద్ర, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్తో కలిసి మీడియా సమా వేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇద్దరు గుజరాతీలు మరో గుజరాతీకి దేశ సంపదను కట్టబెట్టే ప్రయత్నాలు నడవనియ్యబోమని హెచ్చరించారు. ఆదానీకి విద్యుత్ రంగాన్ని కట్టబెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదనీ, దీనిపై ఉద్యోగులతో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. సభ విజయవంతం కాలేదంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్షలు చేయించుకోవాలని ఎద్దేవా చేశారు. ఖమ్మంకు నిధుల వరద పారించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. వద్ధి రాజు రవి చంద్ర మాట్లాడుతూ ఖమ్మంలో బీజేపీకి డిపాజిట్లు కూడా రావనీ, పదికి పది స్థానాలు బీఆర్ఎస్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.