Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ తమిళిసై ఆవేదన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఖమ్మం వేదికగా సాగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో గవర్నర్ వ్యవస్థపై ముఖ్యమంత్రులు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ఖండించారు. సీఎం కేసీఆర్.. గవర్నర్‌ని అవమానించారని ఆమె అభిప్రాయపడ్డారు. విద్యార్థులు పరీక్షల భయాన్ని జయించేందుకు గాను ప్రధాని నరేంద్రమోదీ రాసిన 'ఎగ్జామ్ వారియర్స్' పుస్తకాన్ని గురువారం రాజ్‌భవన్‌లో తమిళిసై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్.. ముఖ్యమంత్రులుగా ఉండి గవర్నర్‌ని ఎలా అవమానిస్తారని ప్రశ్నించారు. పలు మార్లు ప్రొటోకాల్‌పై మాట్లాడినా సీఎం స్పందించలేదని విమర్శించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అడిగే అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవానికి సంబంధించి ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం రాలేదని గవర్నర్ వెల్లడించారు.