Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్థిక పరమైన సైబర్ నేరాల నియంత్రణకై పోలీస్ అధికారులు, రిజర్వ్ బ్యాంక్ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. గురువారం బీఆర్కెఆర్ భవన్లో ఆర్థిక పరమైన సైబర్ నేరాల నియంత్రణపై ఏర్పాటైన రాష్ట్రస్థాయి సమన్వయ సమా వేశం (ఎస్ఎల్సీసీ) సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో నాన్ బ్యాంకింగ్ ఆర్ధిక కార్యకలాపాలు, ఆర్థిక మోసాలు, రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్, డిపాజిట్ల సేకరణ తదితర అంశాలలో ప్రజల నుంచి అందిన ఆర్ధిక లావాదేవీల ఫిర్యాదులు, వాటిపై న్యాయ స్థానాల్లో నమోదైన కేసులను సమీక్షించారు. సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, నాన్ బ్యాంకింగ్ తరహా లోన్ యాప్ల ద్వారా మోసపూరిత కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతున్నందున, ఈ నేరాలపట్ల ప్రజలను అప్రమత్తత చేయాల్సిన అవసరముందన్నారు. ఆర్థిక పరమైన నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు పోలీస్ యంత్రాంగం దృష్టికి వచ్చిన వెంటనే, వాటిపై చర్యలకు తక్షణమే ఉపక్రమించాలని సీఎస్ ఆదేశించారు.