Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ సంచాలకులకు టీఏజేఏసీ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 317 జీవోను దృష్టిలో ఉంచుకుని జీరో సర్వీసు ప్రాతిపదికన ఉపాధ్యాయులందరికీ బదిలీలకు అవకాశం కల్పించాలని టీఏజేఏసీ కోరింది. ఈ మేరకు విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనను గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, టీఏజేఏసీ ప్రతినిధులు, టీఎస్‌జీహెచ్‌ఎంఏ అధ్యక్షులు పి రాజభాను చంద్రప్రకాశ్, పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు ఎం చెన్నయ్య, టీటీయూ అధ్యక్షులు ఎం మణిపాల్ రెడ్డి, ఆర్‌యూపీపీటీఎస్ అధ్యక్షులు జగదీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఎస్ నర్సిములు, టీయూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి రఘునందన్‌రెడ్డి, కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల్లో జాతీయ అవార్డు పొందిన వారికి అదనపు పాయింట్లు కేటాయించాలని సూచించారు. 317 జీవో పెండింగ్ ఆప్పీళ్లను పరిష్కరించాలనీ, 13 జిల్లాల స్పౌజ్ అంశాన్ని సానుకూలంగా పరిశీలించాలని కోరారు. గుండె ఆపరేషన్‌కు సంబంధించి స్టంటును వేసుకున్న ఉపాధ్యాయులను ప్రత్యేక కేటగిరిలో చేర్చాలనీ, లేదంటే అదనపు పాయింట్లు కేటాయించాలని తెలిపారు. గెజిటెడ్ హెచ్ఎం క్యాడర్లో లాంగ్ స్టాండింగ్ ఐదేండ్లను కొనసాగించాలని సూచిం చారు. కోర్టు తుది తీర్పునకు లోబడి పండితులు, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలని కోరారు. కోర్టులో ఉన్న వివిధ కేసుల తుది తీర్పునకు లోబడి విద్యాశాఖలోని అన్ని స్థాయిల్లోని పోస్టులకు పదోన్న తులను అడ్‌హక్ పద్ధతిలో ఇవ్వాలని సూచించారు. విద్యాశాఖ కార్యదర్శి, మంత్రి దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్లి తగు నిర్ణయం తీసుకుంటామంటూ శ్రీదేవసేన హామీ ఇచ్చారని తెలిపారు.
పండితులకూ పదోన్నతులు కల్పించాలి
పాఠశాల విద్యాశాఖలోని అన్ని క్యాడర్లతోపాటు భాషాపండితులకూ పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పండిత జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రైతుబంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గురువారం హైదరాబాద్‌లో జేఏసీ ప్రతినిధులు సి జగదీశ్‌కుమార్, ఎండీ అబ్దుల్లా, చక్రవర్తుల శ్రీనివాస్, ఎస్ నర్సిములు, కాంతికృష్ణ, గౌరీశంకర్ కలిసి వినతిపత్రం సమర్పించారు. కోర్టు కేసు సాకుతో పదోన్నతులు కల్పించకపోవడం వల్ల వేలాదిమంది భాషా పండితులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. కోర్టు తుది తీర్పునకు లోబడి పదోన్నతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.