Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తగా మూడు డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రకటన
- దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌లో కొత్తగా మూడు డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. గతేడాది ఆ సంస్థ ఈ మేరకు ప్రకటించిన విషయం విదితమే. అందు కోసం రూ.16 వేల కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్టు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. 2022 ప్రారంభంలో వంద మెగావాట్ల సామర్థ్యంతో మూడు డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మైక్రోసాప్ట్ ప్రకటించింది.ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న పెట్టుబడి అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సంఖ్యను రెట్టింపు చేస్తూ ఆరు డేటా సెంటర్లను 100 మెగావాట్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. రాబోయే 10-15 సంవత్సర కాలంలో ఈ ఆరు డేటా సెంటర్లు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగిస్తాయని తెలిపింది.క్లౌడ్ ఆధారిత మౌలిక వసతులను పెంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించాలన్న మైక్రోసాఫ్ట్ లక్ష్యంలో భాగంగా ఇంత భారీ పెట్టుబడిని పెడుతున్నట్టు వివరించింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావుతో జరిగిన సమావేశంలో ఈ మేరకు మైక్రోసాఫ్ట్ తమ విస్తరణ ప్రణాళికలను వెల్లడించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ మధ్య ఉన్న బంధం తాజా పెట్టుబడితో మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. భారీ పెట్టుబడితో హైదరాబాద్‌లో కార్యకలాపాలను విస్తరిస్తున్నందుకు మైక్రోసాఫ్ట్ సంస్థకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఆసియా హెడ్ అహ్మద్ మజారీ మాట్లాడుతూ భవిష్యత్తులోనూ హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు.
రూ.150 కోట్లతో గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్
వెబ్‌పీటీ హైదరాబాద్ లో రూ.150 కోట్లతో గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. ఔట్ పేషెంట్ రీహాబిలిటేషన్ థెరపీలో రోగులు, వైద్య సంస్థలకు అవసరమయ్యే డిజిటల్ సేవలను అందించడంలో అంతర్జాతీయంగా పేరున్న సంస్థ వెబ్‌పీటీ అమెరికా లోని ఫీనిక్స్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఔట్‌పేషెంట్ రీహాబిలిటేషన్ థెరపీ సాఫ్ట్వేర్ వెబ్‌పీటీ. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో వెబ్‌పీటీ ఒప్పందం కుదుర్చుకున్నది. కండ రాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడే రోగుల కు మరింత మెరుగైన పద్దతుల్లో రీహాబిలిటేషన్ థెరపీని అందిం చడానికి వైద్య సంస్థలకు అవసరమయ్యే ఎండ్ టు ఎండ్ సాఫ్ట్ వేర్ సొల్యూష న్ను వెబ్‌పీటీ సాఫ్ట్వేర్ అందిస్తుంది. వెబ్‌పీటీ సీఈఓ ఆష్లే గ్లోవర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పాల్ షుగా, సమ్మిట్ కన్సల్టింగ్ సర్వీసెస్ వ్యవస్థా పకుడు, సీఈఓ సందీప్ శర్మ లు మంత్రి కేటీఆర్, ఉన్నతాధికారులతో సమావేశమై తమ విస్తరణ ప్రణాళికలను చర్చించారు. వెబ్ పీటీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. వెబ్ పీటీ విజయాల్లో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుందని హామీనిచ్చారు.