Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో అమెజాన్ భారీ పెట్టుబడులు
- స్వాగతించిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ, అదనపు పెట్టుబడి ప్రకటనను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు స్వాగతించారు. ఆ సంస్థ ఏషియా పసిఫిక్ రీజియన్ కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో 2030 నాటికి రూ.36,300 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎంపవర్ ఇండియా ఈవెంట్లో దావోస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ప్రసంగించారు. ఆ సంస్థ భారీ పెట్టుబడుల తో డేటా సెంటర్ ప్రధాన కేంద్రంగా తెలంగాణ మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అమెజాన్, తెలంగాణ మధ్య మంచి సంబంధాలు న్నాయన్నారు. సంస్థ విస్తరణ ప్రణాళికలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగ దారులకు అత్యుత్తమ క్లౌడ్ సేవలను అందించాలన్న లక్ష్యంలో భాగంగా హైదరాబాద్ చందన్వెల్లి, ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీలో మూడు డేటా సెంటర్లను అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటుచేసింది. ఈ మూడు డేటా సెంటర్ల మొదటి దశ పూర్తికాగా, విని యోగదారులకు పూర్తిస్థాయిలో క్లౌడ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మూడు డేటా సెంటర్లలో మొదట (2020 సంవత్సరంలో) రూ.20,096 కోట్ల పెట్టుబడిగా పెట్టాలనుకుందని తెలిపారు. విస్తరణ ప్రణాళికలు, వ్యాపార వ్యూహాల్లో భాగంగా దశల వారీగా రూ.36,300 కోట్ల పెట్టు బడిగా పెట్టాలని ఆ సంస్థ తాజాగా నిర్ణయించు కుంది. అమెజాన్ సంస్థకు పెట్టుబడుల గమ్యస్థానం గా ముందునుంచి హైదరాబాద్ ఉంది. ప్రపంచం లోనే తన అతిపెద్ద వెబ్ సర్వీసెస్ క్యాంపస్‌తో పాటు ఫుల్ ఫిల్మెంట్ సెంటర్లు రెండింటిని హైదరాబాద్ లోనే అమెజాన్ ఏర్పాటు చేసింది. ఇక ఆ సంస్థ వెబ్ సర్వీసెస్ అందించే క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. ఈ సందర్భంగా వీడియో కాన్ఫెరెన్స్‌లో మాట్లాడిన మంత్రి హైదరాబాద్ డేటా సెంటర్లలో పెట్టుబడుల ను అమెజాన్ విస్తరిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోకి వస్తున్న అతిపెద్ద ఎఫ్‌డీఐల లో ఇదొకటన్నారు. ఇ-గవర్నెన్స్, హెల్త్‌కేర్, పుర పాలక కార్యకలాపాలను మెరుగు పరచడానికి ఏడబ్ల్యుఎస్తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంద న్నారు. హైదరాబాద్ లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్యాంపస్‌లతో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలతో పాటు స్టార్టప్‌లకు ప్రయోజనం కలుగుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.