Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులను నిర్వహించాలని తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకు ల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్ర వారం సంఘం రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ బాలరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. నాలుగేండ్లుగా బదిలీలు లేకపోవటంవల్ల గ్రామీణప్రాంతాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగులు, ప్రిన్సిపాల్లు వత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థలో సర్వీస్ రూల్స్ మార్చి, అన్నిస్థాయిలలోని పోస్ట్‌లకు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 70:30 నిష్పత్తిలో పదోన్నతులను చేపట్టాలని కోరారు. ప్రిన్సిపాల్ పోస్టులకు ప్రమోషన్లు 100 శాతం ఇన్ -సర్వీస్ వారికే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో దీర్ఘకాలంగా ప్రమోషన్లు లేకుండా పనిచేస్తున్న లైబ్రేరియన్లు, పీఈటీలు, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లు, హెల్త్ సూపర్వైజర్లకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.