Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎ కే. ఖాన్కు పరిశీలన బాధ్యతలు:మంత్రి కొప్పుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రంజాన్లోగా మక్కా మసీదు పనులు పూర్తి చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో క్రిస్టియన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే నెల 15నాటికి క్రిస్టియన్ భవన్ టెండర్టు పూర్తి చేయాలన్నారు. పది కోట్లతో క్రిస్టియన్ భవన్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఫారీన్ మోడల్లో క్రిస్టియన్ భవన్ నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. ఇందుకు సంబందించి మోడళ్లను మంత్రి పరిశీలించారు. రంజాన్ నాటికి మక్కామసీదుతో పాటు జామియానిజామియా, అనిగుల్ గుర్భా మరమ్మత్తు, పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని సూచించారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలు మంజూరు అంశంపై చర్చించారు. ఇప్పటి వరకు రెండు లక్షల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పనుల పరిశీలన బాధ్యతలు ప్రభుత్వ సలహాదారు ఎ.కే. ఖాన్ చూస్తారని తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు ఎకే ఖాన్, వక్ఫ్ బోర్డు చైర్మెన్ మసి ఉల్లాఖాన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ ఇంతియాజ్ ఇషాక్, మైనార్టీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆహ్మద్ నదీమ్, ఎండి కాంతి వెస్లీ, డైరెక్టర్ షఫీఫుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.