Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరూ హాజరు కావాలి:కాసాని
నవతెలంగాణ-హైదరాబాద్
తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర విస్త్రృత స్థాయి సమావేశం నెల 23వ తేదీన నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ పోలిట్బ్యూరో సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర అనుబంధ సంఘాల పూర్తి కార్యవర్గం, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీలు, కో-ఆర్డినేటర్లు, త్రిమెన్, ఫైవ్ మెన్ కమిటీ సభ్యులను ఈ సమావేశానికి ఆహ్వానించినట్టు జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. ప్రతి ఆహ్వానితుడూ సమావేశానికి తప్పనిసరిగా హాజరవ్వాలని సూచించారు. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా చేపట్టనున్న ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం, పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగవంతం, పార్టీ సంస్థాగత నిర్మాణం, తదితర అంశాలపై రాష్ట్ర పార్టీ విస్త్రృత స్థాయి భేటిలో ప్రధాన ఎజెండాగా చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ నియమితు లయ్యాక జరుగుతున్న తొలి విస్త్రృత సమావేశం కావడం గమనార్హం.