Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీన్ని సాధించిన ఆయా జిల్లాల రైతుల ఉద్యమ స్ఫూర్తికి అభినందనలు తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ను తరిమికొట్టేదాకా ఇదే ఉద్యమస్పూర్తిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ అప్పుల పాలన ఇలాగే కొనసాగితే తెలంగాణ మరో శ్రీలంక, పాకిస్తాన్ మాదిరిగా మారే దుస్థితి ఏర్పడుతుందన్నారు.