Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్షాల ఐక్యత కోసం కాంగ్రెస్ కృషి: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తారిక్ అన్వర్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలో బీజేపీ చీలిక సిద్ధాంతాన్ని అడ్డుకుంటామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తారిక్ అన్వర్ చెప్పారు. ప్రతిపక్షాలన్ని చీలిపోకుండా ఐక్యత కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో ఎంఐఎం బీజేపీకి బీటీమ్‌గా మారిందనీ, అది ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని తెలిపారు. భారత్ జోడో యాత్ర లక్ష్యాలు నెరవేరే వరకు కాంగ్రెస్ ప్రయత్నం కొనసాగుతుందని తెలిపారు. బీజేపీకి మేలు చేయడమే ఎంఐఎం పని పెట్టుకుందని ఎద్దేవా చేశారు. భారత్ జోడో యాత్ర స్ఫూర్తిని దేశంలో ప్రతీ గ్రామానికి తీసుకెళ్లేందుకే 'హాత్ సే హాత్ అభియాన్ యాత్ర' కొనసాగిస్తామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, పార్టీ నేతలు షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, నదీమ్ జావిద్, కమలాకర్‌రావు, ఆనంతుల శ్యామ్మోహన్, అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే...కేసీఆర్ ప్రభుత్వం రూ ఐదు లక్షల కోట్ల అప్పు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ త్యాగాలు చేసి తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ సర్కారు దోచుకుంటుందని ఆరోపించారు. ప్రజల ఆశలను కేసీఆర్ నేరవేర్చలేకపోయారని చెప్పారు. తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్ల యినా రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరలేదన్నారు. కాంగ్రెస్ లేకుండా కూటమి ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉందని చెప్పారు. పార్టీలో వేర్వేరు వాదనలు వినిపించినా... పార్టీ కోసం అంతా కలిసికట్టుగా పని చేస్తారు.