Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
శాఖల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రవాణా, రోడ్లు, భవనాల శాఖలోకి గృహ నిర్మాణ శాఖను విలీనం చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగహ, డక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హౌల్డింగ్స్ లిమిటెడ్(దిల్)లో కొత్త పథకాలేవీ చేపట్టకపోవడంతో, హౌసింగ్ డిపార్ట్మెంట్ను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో హౌసింగ్ డిపార్ట్మెంట్కు చెందిన ఆస్తులు, పథకాలు, సిబ్బంది బాధ్యతలను ఆర్ అండ్ బీ శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఆర్ అండ్ బీ శాఖలోనే ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు.కాగా రోడ్లు-భవనాలు, హౌసింగ్ శాఖల 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలపై శుక్రవారం సమీక్ష జరిగింది. హైదరాబాద్‌లోని ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. గత సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలు, ఖర్చు, 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రతిపాదనలపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్బంగా ఉన్నతాధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. తగు మార్పులు, చేర్పులు చేసి ఆర్ధిక శాఖకు తుది బడ్జెట్ ప్రతిపాదనలు పంపించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సునీల్ శర్మ, రోడ్లు భవనాలు శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు,స్పెషల్ సెక్రెటరీ విజయేంద్ర బోయి, ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు ఐ గణపతిరెడ్డి, రవీందర్రావు, సీఈలు సతీష్, మధుసూధన్, గహ నిర్మాణశాఖ ఎస్.ఈ లు చైతన్యకుమార్, రవీందర్ రెడ్డి రాష్ట్రస్థాయి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.