Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)కు రెండు స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డులు లభించాయి. శుక్రవారం ఆన్లైన్ లైవ్‌లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆ సంస్థ సీఎమ్‌డీ అన్నమనేని గోపాలరావు ఈ అవార్డులను స్వీకరించారు. ఇంటిగ్రేటెడ్ స్పాట్ బిల్లింగ్ (ఐఆర్డిఏఏ జీపీఆర్ఎస్ ఎనబిల్డ్), సోలార్ విద్యుత్ పంపిణీ కేటగిరిల్లో ఈ అవార్డులు లభించినట్టు ఆ సంస్థ పౌరసంబంధాల అధికారి వై రాజ్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సీఎమ్‌డీ గోపాలరావు మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ స్పాట్ బిల్లింగ్ వల్ల మీటర్ రీడింగ్ తప్పిదాలు లేకుండా, రెవెన్యూలో ఖచ్చితత్వం ఉంటుందని వివరించారు. 37.86 లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు ఈ విధానం ద్వారా ప్రతినెలా బిల్లులు అందిస్తున్నామని చెప్పారు. సోలార్ విద్యుదుత్పత్తిలో ఆగస్టు 2022 నాటికి 1,246 మెగావాట్లకు చేరుకున్నామనీ, పీక్ అవర్ డిమాండ్‌లో ఇది చాలా ఉపయోగపడుతున్నదనీ తెలిపారు. ఈ విధానాలకు అవార్డులు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.