Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐ ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) ప్రథమ సంవత్స రం చదువుతున్న (2021-2023) బ్యాచ్ విద్యార్థులకు ఈనెల 22 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డీపీఎస్ఈ విద్యార్థులకు ఈనెల 27 వరకు, డీఈఐఈడీ విద్యార్థుల కు ఈనెల 28 వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. పాత బ్యాచుల్లో ఫెయిలైన విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు హాజరు కావాలని కోరారు.