Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పాఠశాల విద్యాశాఖలోని అన్ని క్యాడర్లతోపాటు భాషాపండితులకూ పదోన్నతులు కల్పించాలని ఆర్యూపీపీటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) వి శాంతికుమారిని శుక్రవారం హైదరాబాద్లో ఆ సంఘం అధ్యక్షులు ఎండీ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ, ఉపాధ్యక్షులు ఘనపురం దేవేందర్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉన్నత తరగతులు బోధిస్తున్న భాషా పండితులకు పదోన్నతులు కల్పించకపోవడంతో వారు తీవ్ర నిరాశకు లోనవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు అనుమతి తీసుకుని తుదితీర్పునకు లోబడి పదోన్నతులు కల్పించేలా విద్యాశాఖ అధికారులను ఆదేశించాలని కోరారు. ప్రపంచ తెలుగు మహా సభ ల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం పండితులకు న్యాయం చేయాలని తెలిపారు.