Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రోకెమ్ లో తపస్య విలీనం అయ్యింది. వివిధ డొమైన్ల కోసం ఏపీఐ పౌడర్ హ్యాండ్లింగ్ సొల్యూషన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రోకెమ్ ఫార్మా డివిజన్లో గ్రాన్యులేషన్లో ఫార్మాస్యూటికల్, న్యూట్రాస్యూటికల్, ఫుడ్ ఇండిస్టీలకు సాలిడ్ ఫార్ము లేషన్లను అందించే సింగిల్-స్టాప్ సొల్యూషన్ ప్రొవైడర్ అయిన తపస్యతో విలీనమయినట్లు ఇరు సంస్థలు శుక్ర వారం హైదరాబాద్‌లో ప్రకటించాయి. దీని వలన కంపెనీ లు ఫార్మా, ఫుడ్ ఇండిస్టీకి ప్రముఖ వన్-స్టాప్ సొల్యూషన్ గా ఉద్భవించటానికి మిశ్రమ నైపుణ్యం, తయారీ బలాలను ఉపయోగించుకునేలా చేస్తుందని పేర్కొన్నాయి. ''ఈ విలీనమైన అవకాశాల గురించి నేను నిజంగా సంతోషిస్తు న్నాను. మేము కలిసి మా క్లయింట్లకు నిలువుగా, మెరుగైన పనితీరు , విశ్వసనీయతను అందించే వినూత్న పరిష్కారాలను అందించగలుగుతాము. మేం కొనసాగిస్తున్న 'మేక్ ఇన్ ఇండియా' విజన్‌కు ప్రతిబింబంగా, మరింత బలపడేందుకు, మెరుగైన ప్రభావాన్ని చూపేందుకు ఎదగగలం'' అని ప్రోకెమ్ డైరెక్టర్ శశి రారు అన్నారు.