Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ యువజన అవార్డును వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన జిక్కి శ్రీకాంత్ పొందారని యువజన సర్వీసుల శాఖ కమిషనర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12నుంచి 16వరకు కర్నాటకలో జరిగిన యువజన వారోత్సవాల్లో శ్రీకాంత్... ఆ రాష్ట్ర గవర్నర్ తావల్చంద్ గెహ్లట్,సీఎం బసవరాజ బొమ్మై, కేంద్ర యువజన వ్యవహారాల మంత్రి అనురాగ్ ఠాగూర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారని తెలిపారు.