Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మొక్కలు నాటడమంటే రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమేనని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ మంత్రుల నివాస సముదా యం లో 13వ గ్రాండ్ నర్సరీ మేళా బ్రోచర్‌ను హరీశ్‌రావు ఆవిష్కరించారు. అల్ ఇండియా హార్టీకల్చర్, అగ్రికల్చర్ షో ఈ నెల 26 నుంచి నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ప్రారంభ మవుతుందని తెలిపారు. ఐదు రోజులపాటు నిర్వహించే ఈ షోలో హార్టీకల్చర్ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల తోటలు, ఎరువులు, ఆర్గానిక్ ఉత్పత్తులు, అగ్రికల్చర్ ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్స్, ఎడ్యుకేషన్, ఫుడ్ ఇండిస్టీ ఉత్పత్తులు ప్రదర్శిస్తారని తెలిపారు. హైడ్రోఫోనిక్, టెర్రస్ గార్డెనింగ్, వర్టీకల్ గార్డెనింగ్ వంటి నూతన టెక్నాలజీ ప్రదర్శిస్తారని చెప్పారు. దేశ వ్యాప్తంగా 150కు పైగా నర్సరీ స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ప్రధానంగా డార్జిలింగ్, కోల్‌కతా, ఢిల్లీ, హర్యానా, ముంబయి, బెంగుళూరు, పూణే, షిర్డీ, కడియం, చెన్నై తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చిన ప్లాంట్స్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. మేళా ఇంచార్జి ఖాలీద్ అహ్మద్ మాట్లాడుతూ నెక్లెస్ రోడ్లో ఈనెల 26 నుంచి 30 వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. సౌది అరేబియా నుంచి వచ్చిన టిష్యూకల్చర్ వెరైటీ డేట్ఫామ్ ప్రత్యేక అందుబాటులో ఉంటుందని వివరించారు.