Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే విద్యాసంవత్సరంలో అమలు
- ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో డిగ్రీ విద్యలో బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సును ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. శుక్రవారం హైదరాబాద్లో ఉన్నతవిద్యామండలి పాలకమండలి సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం తనను కలిసిన విలేకర్లతో ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి మాట్లాడుతూ బీఏ ఆనర్స్ (ఎకనామిక్స్), బీఏ ఆనర్స్ (పొలిటికల్ సైన్స్) కోర్సులు నిజాం కాలేజీ, కోఠి మహిళా కాలేజీ, సిటీ కాలేజీ, బేగంపేట మహిళా డిగ్రీ కాలేజీలో ఉన్నాయని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరంలో బీఎస్సీ ఆనర్స్ (కంప్యూటర్ సైన్స్) కోర్సును ప్రవేశపెడతామని వివరించారు. రాష్ట్రంలోని ప్రముఖ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతోపాటు ప్రయివేటు కాలేజీల్లోనూ ఈ కోర్సును అందుబాటులోకి తెచ్చే ఆలోచన చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, ఓయూ వీసీ డి రవీందర్, శాతవాహన వర్సిటీ వీసీ ఎస్ మల్లేశం, ఎంజీయూ వీసీ సిహెచ్ గోపాల్రెడ్డితోపాటు ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.