Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గర్భిణీ అభ్యర్థులకు టీఎస్ఎల్పీఆర్బీ సూచన
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు ప్రిలిమినరీ రాతపరీక్ష రాసిన గర్భిణీ అభ్యర్థులు తమ మెడికల్ సర్టిఫికెట్లను ఈనెల 31 లోగా తమకు సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మెన్ వి.వి శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. హైకోర్టు చేసిన సూచనల మేరకు గర్భిణీ అభ్యర్థులకు కానిస్టేబుల్, ఎస్సై దేహదారుడ్య పోటీల నుంచి మినహాయింపును ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఆ అభ్యర్థినులకు తుది రాత పరీక్ష రాయడానికి అనుమతిని చ్చారు. అంతేగాక, తుది రాత పరీక్ష తర్వాతలో నెగ్గిన అభ్యర్థినులు నెల రోజుల తర్వాత తప్పనిసరిగా దేహదారుడ్య పరీక్షలో (పీఎంటీ, పీఈటీ)పా ల్గొని నెగ్గాల్సి ఉంటుందని ఆ సమయంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సదరు పోస్టులకు చెందిన గర్భిణీ అభ్యర్థులు తమ మెడికల్ సర్టిఫికెట్లను బోర్డు సూచించిన దరఖాస్తుతో సహా ఈనెల 31లోపు టీఎస్ఎల్పీఆర్బీ కార్యాలయం ఇన్వర్ట్ సెక్షన్లో సమర్పించాల్సి ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. ఒకవేళ మెడికల్ సర్టిఫికెట్ సమర్పించకపోతే వారికి ఈ పోస్టుల పట్ల ఆసక్తి లేనట్టుగా పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.